AP: వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీలపై పట్టుకోల్పోగా.. తాజాగా మరో రెండు ఆ జాబితాలో చేరాయి. మడకశిర మున్సిపల్ ఛైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ, వైస్ ఛైర్మన్ రామచంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మానంపెట్టగా.. ఎమ్మెల్యేతోపాటు 15 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. దీంతో వారు పదవులు కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై వ్యతిరేకతతో మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ మాచనూరు చంద్ర పార్టీకి రాజీనామా చేశారు.