AP: వైసీపీకి 11 సీట్లు వచ్చినా బుద్ధి మారడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శనివారం ఎక్స్ వేదికగా.. వైసీపీ అధినేత జగన్‌పై ఫైరయ్యారు. ‘కొనుగోలు చేయడానికి నీలా కొట్టేసిన డబ్బు నా దగ్గర లేదు జగన్’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, చినబాబుకు షికారు కోసం రూ.172 కోట్ల ప్రజల డబ్బుతో హెలికాప్టర్ కొనుగోలు చేసిందని వైసీపీ పోస్టు పెట్టింది. ఈ పోస్టు ఫేక్ అని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.