AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీలో కొనసాగుతున్నారా? లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. తాజాగా తమ్మినేని తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ ఇంచార్జిగా ఆయనకు పదవి ఉంది. కానీ మాజీ స్పీకర్‌గానే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం విశేషం. దీంతో తమ్మినేని స్వతంత్ర పంథాలో ముందుకు సాగుతున్నారా అన్న చర్చకు తెరపైకి వస్తోంది.