AP: ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనలో 9 మందిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సాయంత్రం పొదిలి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అల్లరి మూకలు రాళ్లు, చెప్పులు విసరడం వల్ల పోలీసులు, మహిళలు గాయపడ్డారని వెల్లడించారు.