AP: వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. వైసీపీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమం తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని జక్కంపూడి రాజా ఒక ప్రకటనలో తెలియజేశారు.