AP: ‘వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి’ అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రియాంబర్స్‌మెంట్ ఇవ్వలేదన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బొత్స అన్నారు. పార్టీ నేతలకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.