విజయనగరంలో 5 వేల మందితో యోగాసనాలు

85చూసినవారు
విజయనగరంలో 5 వేల మందితో యోగాసనాలు
AP: విజయనగరం రూరల్ ఎస్.కోట మండలం చినఖండేపల్లిలోని సత్యసాయి దివ్యామృతం ఆశ్రమం ఆవరణలో రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో యోగా భాగం కావాలన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, యోగా చేస్తున్నప్పుడు భారీ గాలులు వీచడంతో కటౌట్ విరిగి ఇద్దరికి గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్