ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడు ఆత్మహత్య

82చూసినవారు
ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడు ఆత్మహత్య
TG: ప్రియురాలికి వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన వర్మ ప్రధాన్(28) ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వారి మధ్య గొడవలు రావడంతో మాట్లాడుకోవడం లేదని తెలిపారు. గత రాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసిన వర్మ ఆమె చూస్తుండగానే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్