పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వవరంలో దారుణం చోటు చేసుకుంది. బుర్రిపాలెంకు చెందిన యువకుడి కాలికి గడ్డ అయింది. దాంతో మల్లికార్జున్ రెడ్డి అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వైద్యం కోసం వెళ్లాడు. కాలికి వచ్చిన గడ్డను తొలగించేందుకు మల్లికార్జున్ రెడ్డి ఇంజెక్షన్ ఇచ్చాడు. అయితే వైద్యం వికటించడంతో యువకుడు మృతి చెందాడు. ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.