AP: చిత్తూరు జిల్లా పీలేరులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. స్థానిక బస్టాండ్ వద్ద ఇద్దరు విద్యార్థినులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. గాయపడిన విద్యార్థులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.