AP: కృష్ణా జిల్లాలోని పెనమలూరులో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో బలిశెట్టి సురేష్(39) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి కొంతకాలం కిందట వివాహం కాగా భార్యతో విభేదాలు రావడంతో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. కొన్నరోజుల నుంచి మద్యం ఎక్కువగా తాగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సురేష్ ఓ రేకుల షెడ్డు వద్దకు వెళ్లి ఉరేసుకుని చనిపోయాడు.