AP: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది సహా చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఎయిరిండియా ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.