AP: గత ప్రభుత్వంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం పాత్రధారి, సూత్రధారి వైఎస్ జగనేనని టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సిట్ విచారణలో జగన్, ఆయన అనుచరుల పాత్రలు బయటకొస్తుండడంతో.. తన సొంత మీడియాలో తప్పుడు కథనాల్ని ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఒక్కో మద్యం దుకాణం అద్దె రూ.30 వేల నుంచి 40 వేలు ఉంటే.. రూ.లక్షన్నర, రూ.రెండు లక్షలు చొప్పున చెల్లించినట్లు చూపించి రూ.671 కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు.