AP: విజయవాడ YCP నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారి తీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.