తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.