గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గురువారం ఆయన ట్వీట్ చేశారు. విమానం కూలిపోయిన విషయం తెలిసి తాను షాక్ అయ్యానని జగన్ వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అని జగన్ రాసుకొచ్చారు.