వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం మళ్లీ బెంగళూరుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు. 4.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 6.40 గంటలకు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి యలహంక నివాసానికి పయనమవుతారు.