వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మేము సైతం అంటూ బద్వేలు నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త రితేష్ రెడ్డి గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని ఉండవల్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి 10 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చర్యలను ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారని రితీష్ రెడ్డి కొనియాడారు.