ప్రశాంత వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోండి: సీఐ

73చూసినవారు
ప్రశాంత వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోండి: సీఐ
ప్రశాంత వాతావరణంలో వినాయకచవితి పర్వదినాన్ని జరుపుకోవాలని బద్వేలు అర్బన్ సీఐ ఎం. రాజగోపాల్ సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులతో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని, నిర్వాహకులే తగిన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల ఆదేశాలు పాటించాలన్నారు. అర్బన్ ఎస్సైలు ఎం సత్యనారాయణ, జె రవికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్