కడప కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారిగా కె. రాజేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ప్రకాష్‌ను నెల్లూరు కేంద్ర కారాగారానికి బదిలీ చేయగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావు కడపకు వచ్చారు. దీంతో పాటు ఈయనకు జైళ్లశాఖ రాయలసీమ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేస్తున్న జైళ్లశాఖ అదనపు డీఐజీ వర్ర పసాద్‌ను గుంటూరు డీఐజీగా బదిలీ చేశారు.