
కేంద్ర మంత్రులను కలిసిన బద్వేల్ టిడిపి నేత రితీష్
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కారీని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త రితీష్ రెడ్డి బుధవారం కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభ్యర్థనలు వారి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని కోరినట్లు తెలియజేశారు.