మైలవరానికి 400 క్యూసెక్కుల నీటి విడుదల

76చూసినవారు
మైలవరానికి 400 క్యూసెక్కుల నీటి విడుదల
జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు శుక్రవారం డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. మైలవరం పరివాహక ప్రాంతంలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు నీటిని వదులుతున్నట్లు డీ ఈ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులో 2. 498 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్