కొండాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందించే ఫిజియోథెరపీ పై ఎంఈఓ ఎం. ఓబులేసు, ఎంఈఓ -2 కె. రామయ్య అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. కొండాపురం వెలుగు కార్యాలయం సభా భవనంలో నిజాం ఫిజియోథెరపీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ వివిధ రకాల ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసి ప్రధానోపాధ్యాయులకు చూపించారు.