కడపకు చెందిన రమేష్ రెడ్డి ఈనెల 18న మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి ఫస్ట్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గౌరీ ఎదుట హాజరుపరచగా నిందితుడికి ఏడు రోజులు జైలు శిక్ష, రూ. 3వేలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ జావీద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.