జూన్ నెల 4 న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా ఎస్. పి సిద్దార్థ్ కౌశల్ జమ్మలమడుగు నియోజకవర్గ కౌంటింగ్ కు సంబంధించి చేపట్టాల్సిన బందోబస్త్ ఏర్పాట్లపై శనివారం అర్బన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎస్. పి కౌంటింగ్ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ, ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదన్నారు.