కమలాపురం నూతన ఎస్సై ప్రతాప్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, మండల అధ్యక్షుడు సిరిగిరి రెడ్డి, రాఘవరెడ్డి బీసీ నాయకులు గండి నారాయణ, పల్లె రామ సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.