11న వల్లూరులో నరసింహస్వామి జయంతి

72చూసినవారు
11న వల్లూరులో నరసింహస్వామి జయంతి
వల్లూరు పడమటి వీధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి (పిచ్చమ్మ సత్రం) ఆలయంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం నరసింహ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు శనివారం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కోలాటం, గ్రామోత్సవం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్