మైదుకూరు మండలం విశ్వనాధపురం వద్దనున్న తెలుగు గంగ పంట కాలువను శుక్రవారం రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ, రైతు నాయకులు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బ్రహ్మ సాగర్ నుండి పంట పొలాలకు నీరు అందించే కాలువలను ఆక్రమించి పూడ్చి వేయడం వలన పంట సమయంలో నీరందక రైతుల ఇబ్బంది పడ్డారని, సంబంధిత అధికారులు క్షేత్ర పర్యటన చేసి సమస్యల పరిష్కరించాలన్నారు.