మైదుకూరు పట్టణంలో ప్రధాన రోడ్ల పైన తారా రోడ్డు నుంచి డ్రైనేజ్ వరకు ఉన్న మట్టిని, డ్రైనేజీ లో ఉన్నటువంటి పూర్తిస్థాయి మట్టిని కూడా క్లీన్ చేసుకోలేని పరిస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ. డ్రైనేజీ లోని పూడికను తీసివేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేస్తే అక్రమ దారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.