సుప్రీంకోర్టు తీర్పు శుభవార్తతో ఎమ్మార్పీఎస్ నేతల ఆనందోత్సవాలు బ్రహ్మంగారిమఠం మండలంలో గురువారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు, ఉపాధ్యక్షులు జగజీవన్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చెండ్రాయుడు, నారాయణ, హృదయనాథ్, ఎస్ఆర్ కృష్ణ, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు గురవయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి కేక్ కట్ చేశారు.