ఖాజీపేట మండల తహసిల్దార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో శుక్రవారం కాజీపేట నూతన తహసిల్దార్ గా సరస్వతి బాధ్యతలు చేపట్టారు. వారికి మండల రెవెన్యూ సిబ్బంది ప్లాంటేషన్ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం నూతన తహసిల్దార్ రెవిన్యూ సిబ్బందిని పరిచయం చేసుకొని, మండల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.