చక్రాయపేట: నాటు సారా నిర్మూలనకు సహకరించాలి

56చూసినవారు
చక్రాయపేట: నాటు సారా నిర్మూలనకు సహకరించాలి
నాటు సారా నిర్మూలనకు గ్రామస్థులు అధికారులకు సహకరించాలని ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్ పేర్కొన్నారు. గురువారం చక్రాయపేట మండలం కల్లూరుపల్లె తండాలో నవోదయం-2 కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలనపై గ్రామసభ నిర్వహించారు. నాటుసారా వలన కలిగే నష్టాలు, వాటి నివారణా చర్యల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.