పులివెందుల మున్సిపాలిటీలోని 32వ వార్డు బ్రాహ్మణపల్లిలో సుమారు 105 కుటుంబాలు ఉన్నాయని, ఇంటి యజమాని పేరుతో డోర్ నెంబర్లు ఇవ్వాలని కౌన్సిలర్ మహేశ్వర్రెడ్డి మున్సిపల్ కమిషనర్ రాముడును
కోరారు. ఆయన గురువారం మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏళ్ల గడుస్తున్నా వార్డులోని కొంతమంది గృహ యజమానులకు వారి పేరుతో పన్నులు కానీ, డోర్ నెంబర్లు కానీ లేవని, వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.