పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి.. వారి ప్రవర్తన ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని జగన్ అసత్యాలు చెబుతున్నారు. వైసీపీ నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోం' అని మంత్రి హెచ్చరించారు.