సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2023-24 లో సంస్థకు వచ్చిన లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ప్రకటిస్తునట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. గతేడాది సంస్థకు రూ. 4,701 కోట్ల లాభాలు రాగా అందులో రూ. 796 కోట్లను బోనస్ గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో సింగరేణి కార్మికుడికి లక్షా 90 వేల బోనస్ అందుతుందన్నారు. చరిత్రలో తొలిసారి సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.5 వేల బోనస్ ఇస్తునట్లు భట్టి వెల్లడించారు.