AP: బాత్రూమ్‌లో 10 అడుగుల గిరినాగు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడిపల్లిలోని ఓ ఇంటి బాత్రూమ్‌లోకి గిరినాగు ప్రవేశించింది. పామును చూసి ఇంట్లో వారు పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ భారీ సర్పం స్నేక్ క్యాచర్‌ను కొద్దిసేపు ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు బంధించిన గిరినాగును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.