కొత్త ఏడాదిలో తెలంగాణలో ఉద్యోగాల కల్పన జోరందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మేర ఉద్యోగాల కల్పన సాధ్యమంటున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (బీసీసీలు), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), రిటైల్ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం పేర్కొంది.