రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లోకి రూ.10 వేలు

66చూసినవారు
రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లోకి రూ.10 వేలు
ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో రేపటి (శుక్రవారం) నుంచి రూ.10వేల నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదన్నారు. వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని పది బృందాలు రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నాయని స్పష్టం చేశారు. కాగా తమకు జరిగిన నష్టానికి రూ.10 వేలు ఎటూ సరిపోవని బాధతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్