డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు

67చూసినవారు
డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు
TG: సూర్యాపేట DSP పార్థసారథి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడంతో, హయత్ నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మరికొన్నిచోట్ల మంగళవారం అధికారులు సోదాలు నిర్వహించారు. అతని ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లతో పాటు.. అక్రమంగా 100 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. బుల్లెట్లు లభ్యం కావడంతో అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్