కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం MLA, MLCలకు శుభవార్త చెప్పింది. CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. అలాగే అలవెన్సెస్ కూడా పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో, సీఎం జీతం నెలకు రూ. 1,50,000, మంత్రి జీతం నెలకు రూ. 1,25,000, MLA, MLCల జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సవాళ్ల దృష్ట్యా ఈ పెంపుపై ప్రజలు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.