నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమా ‘రామాయణ’. ఈ మూవీలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందం ఎక్స్‌లో పంచుకుంది. ‘రామాయణ కోసం దాదాపు 10వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేశారు. ‘అవతార్’, ‘డ్యూన్’ సినిమాలకు పనిచేసిన వారికంటే రెండింతల మంది ఈ దృశ్యకావ్యంలో భాగస్వాములయ్యారు’ అని పేర్కొంది.