TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన చెంచులకు 10వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఉట్నూరు, భద్రాచలం, మన్ననూర్, ఏటూరు నాగారం ITDAల పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 500-700 ఇళ్లు అందిస్తామని వెల్లడించారు. చెంచుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. చెంచులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.