ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. ఈ క్రమంలో మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జన్మించినట్లు వైద్యులు వెల్లడించారు. అన్ని సాధారణ కాన్పులేనని తెలిపారు. శిశువులకు గంగా, జమున, బసంతి వంటి పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు. ఇక, మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.