మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన సెంట్రల్ హాస్పిటల్లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని వెల్లడించారు. వీరిలో యూపీ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.