యెమెన్‌లో పడవ మునిగి 13 మంది మృతి

71చూసినవారు
యెమెన్‌లో పడవ మునిగి 13 మంది మృతి
యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగి 13మంది మరణించగా.. 14మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. మృతుల్లో 11మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పేర్కొంది. 25మంది ఇథియోపియన్ వలసదారులు, ఇద్దరు యెమెన్ పౌరులతో జిబౌటి నుంచి వస్తుండగా, దుబాబ్ జిల్లా సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలిపింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్