చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

63చూసినవారు
చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
TG: సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచుల దశాబ్దాల సొంత ఇండ్ల‌ కలను రేవంత్ సర్కార్ నెరవేర్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం వారికి 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా రేపు అచ్చంపేటలోని మున్న‌నూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్