దశాబ్దాలుగా ప్రత్యేక బలూచిస్థాన్ కోసం BLAతో పాటు, పలు సంస్థలు PAKపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు భారత్-PAK ఉద్రిక్తతలు జరుగుతుండగా.. మరోవైపు మే 9న పాక్ సైనికులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) దాడి చేసింది. ఆ దాడిలో 14 మంది పాక్ సైనికులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఆ వీడియోను BLA తాజాగా రిలీజ్ చేసింది. PAKలోని పంజ్గర్ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై తొలుత తుపాకులతో కాల్పులు జరిపి, ఆపై బాంబులతో పేల్చిసింది.