TG: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 20 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించగా.. నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి.