మహిళా గ్రూపులకు 150 బస్సులను కేటాయించాం: సీఎం

63చూసినవారు
మహిళా గ్రూపులకు 150 బస్సులను కేటాయించాం: సీఎం
TG: ఆర్టీసీ ద్వారా నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 600 బస్సులను వెంటనే తీసుకుని నడిపించాలన్నారు. 'రూ. 500 లకే సిలిండర్, పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించాం. పాఠాశాలల్లో విద్యార్థులకు 1 కోటి 30 లక్షల యూనిఫామ్ డ్రెస్సుల బాధ్యత కూడా వారికే అప్పగించాం. కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్