తెలంగాణలో కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూల్స్ వెంటనే ప్రారంభించాలని డీఈఓలకు సూచించింది. అవసరమైన ఫర్నీచర్, విద్యా సామగ్రి ఖర్చుల కోసం బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుందని తెలిపింది.